Bomb Threat Calls: దేశవ్యాప్తంగా ఈ ఏడాదిలో విమానాలకు 719 బాంబు బెదిరింపు కాల్స్..!

by Maddikunta Saikiran |
Bomb Threat Calls: దేశవ్యాప్తంగా ఈ ఏడాదిలో విమానాలకు 719 బాంబు బెదిరింపు కాల్స్..!
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశం(India)లో ఇటీవల కాలంలో ఆగంతకుల నుంచి విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్(Bomb Threat Calls) విపరీతంగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఇందులో ఎక్కువగా డొమెస్టిక్ విమానాల(Domestic Flights)కే బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. విమానాలే టార్గెట్ చేసుకొని కాల్స్ చేస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇండియాలోని విమానయాన సంస్థల(Airlines)కు గడిచిన ఐదేళ్లలో 809 ఫేక్ బాంబ్ థ్రెట్ కాల్స్ వచ్చినట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్(Muralidhar Mohol) రాజ్యసభలో వెల్లడించారు. ఇందులో 719 కేసులు ఈ ఒక్క సంవత్సరమే నమోదైనట్లు తెలిపారు. ఇక 2020లో నాలుగు, 2021లో రెండు, 2022లో 13, 2023లో 71 చొప్పున బాంబు బెదిరింపులు ఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పారు. అయితే, చాలా సార్లు కావాలనే ఇలాంటి ఫేక్ కాల్స్, మెసేజ్‌లు చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని మురళీధర్ పేర్కొన్నారు. ఇక ఫేక్ బాంబ్ థ్రెట్ కాల్స్ కట్టడి చేయడానికి ఏవియేషన్ చట్టాల్లో(Aviation Laws) కీలక మార్పులు చేస్తామని, ఫేక్ కాల్స్ చేస్తున్న నిందితులు ఎంతటి వారైనా విడిచి పెట్టమని అన్నారు.

Next Story

Most Viewed