- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మళ్లీ కీలక వ్యాఖ్యలు బీహార్ సీఎం నితీశ్ కుమార్

X
పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ తో సహా ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వస్తే బీజేపీకి ఓటమి తప్పదని అన్నారు. తాను చెప్పినట్లు చేస్తే బీజేపీ 100 సీట్లలోపే పరిమితమవుతుందని చెప్పారు. తాజాగా సీపీఎం 11వ సాధారణ సదస్సులో ఆయన మాట్లాడారు. ఆయనకు ప్రధాని కావాలని ఎలాంటి కోరికలు లేవని పునరుద్ఘాటించారు. దేశాన్ని ఐక్యంగా ఉంచి, విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నవారి నుంచి ప్రజలకు విముక్తి కల్పించడమే తన లక్ష్యమని చెప్పారు. కాంగ్రెస్ ప్రతిపక్షాలతో కలిసొచ్చే విషయమై త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. వారు తన సలహాను తీసుకుని కలిసి పోటీ చేస్తే బీజేపీ 100 సీట్లలోపే పరిమితం అవుతుందన్నారు. ఒకవేళ పాటించకపోతే ఏమవుతుందో మీకు తెలుసు అని కాషాయ పార్టీని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
Next Story