- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Hemant Soren: రెండు దశాబ్దాలకు సరిపడా రాష్ట్రాన్ని పిండేసింది- హేమంత్ సోరెన్
దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్(Hemant Soren) విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలను ఇబ్బందిపెట్టడంలో బీజేపీ(BJP) మాస్టర్ అని మండిపడ్డారు. జీఎస్‌టీ విధించి.. రాష్ట్రాలకు వారి ఆదాయ వనరులు లేకుండా చేసిందని మండిపడ్డారు. జార్ఖండ్ రాష్ట్రాన్ని రెండు దశాబ్దాలకు సరిపడా బీజేపీ పిండేసిందని అన్నారు. అలానే చేసి కాషాయ పార్టీ అనేక ప్రభుత్వాలను కూలగొట్టిందని ఆరోపించారు. అందుకు ఉదాహరణే బిహార్ సీఎం నీతీశ్‌కుమార్‌ను ఎన్డీఏలో చేర్చుకోవడమని అన్నారు. అభివృద్ధిని అడ్డుకోవడానికి కమలం పార్టీ పలు ప్రయత్నాలు చేసిందని, అవి బెడిసికొట్టడంతో తనపై కుట్ర పన్ని జైలుకు పంపించిందని ఆరోపించారు. ఆ పార్టీ చేసే ‘విభజన రాజకీయాలు’ జార్ఖండ్ ప్రగతిని ఆపలేవని అన్నారు. మత విద్వేషాలు, విభజన రాజకీయాలు తప్ప బీజేపీకి మరో ఎజెండా లేదన్నారు. మోడీకి ఎన్నిసార్లు లేఖలు రాసినా కేంద్రం నుంచి అందాల్సిన రూ.1.36 లక్షల కోట్ల బొగ్గు బకాయిలు రాలేదని అన్నారు. ఆ డబ్బు ఎలా పొందాలో తమకు తెలుసన్నారు.
బీజేపీపై విమర్శలు
మణిపూర్‌లో కంటే జార్ఖండ్ లో గిరిజనుల పరిస్థితి దారుణంగా ఉందని ప్రధాని అబద్ధాలు చెప్పడమే వారి కుట్రపూరిత ఆలోచనలను తెలియజేస్తున్నాయని సోరెన్ అన్నారు. ఒక గిరిజనుడ్ని సీఎంగా బీజేపీ జీర్ణించుకోలేకపోతోందన్నారు. జార్ఖండ్ లో నెలలతరబడి ఎన్నికల ప్రచారాలు చేస్తున్న సీఎంలు.. వారి రాష్ట్రాల పరిస్థితులను ఎందుకు పట్టించుకోవట్లేదు అని ప్రశ్నించారు. జార్ఖండ్ లో చొరబాటుదారుల గురించి మాట్లాడే కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit shah) తమ సొంత పార్టీ నేతలు చేసే అవినీతిని, అక్రమాలను ఎందుకు గుర్తించట్లేదని అడిగారు. సీబీఐ, ఈడీ వంటి కేంద్ర ఏజెన్సీలను బీజేపీ నియంత్రిస్తోందని మండిపడ్డారు. గుజరాత్ పోర్టుల్లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడంపై ప్రధాని (PM Modi) ఎందుకు స్పందించట్లేదు అని ప్రశ్నించారు. ఇకపోతే, 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీకి రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 13న తొలివిడత, నవంబర్ 20న రెండోవిడత పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఫలితాలు రానున్నాయి.