- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హిండెన్ బర్గ్ - అదానీ అంశంపై తొలిసారి స్పందించిన అమిత్ షా.. ఏమన్నారంటే?
దిశ, డైనమిక్ బ్యూరో: అదానీ గ్రూప్ కంపెనీలపై హిండెన్ బర్గ్ నివేదిక విషయంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తొలిసారి స్పందించారు. ఓ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంలో బీజేపీ దాచడానికి గానీ భయపడాల్సిన పనిగాని లేదని అన్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లినందున ఓ మంత్రిగా తాను ఇంకేమీ వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. హిండెన్ బర్గ్ నివేదికపై పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
రాహుల్ గాంధీ ఏం మాట్లాడాలో అతడు లేదా అతని స్క్రిప్ట్ రైటర్లు నిర్ణయించుకోవాలని ఎద్దేవా చేశారు. 'క్రోనీ క్యాపిటలిజం' అంటూ బీజేపీపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ ఈ అంశంలో ఇప్పటి వరకు బీజేపీపై ఎవరూ అలాంటి ఆరోపణలు చేయలేదు. వారి (కాంగ్రెస్)హయాంలోనే ఏజెన్సీలు సంస్థలు కాగ్, సీబీఐ పెద్దఎత్తున అవినీతిని గుర్తించి కేసులు నమోదు చేసిన సంగతిని అమిత్ షా గుర్తు చేశారు.
వారి హయాంలోనే సుమారు రూ. 12 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఈడీ, సీబీఐ సంస్థలను ఉసిగొల్పడం ద్వారా ప్రతిపక్షాలను బీజేపీ నిర్వీర్యం చేస్తోందన్న ఆరోపణలపై స్పందిస్తూ అలాంటి అనుమానాలు ఉంటే కోర్టులకు వెళ్లాలని, కోర్టులు బీజేపీ ప్రభావంలో లేవని అన్నారు. గతంలో పెగాసస్ ఇష్యూపై కూడా తాను కోర్టులకు వెళ్లమని సూచించానన్నారు.
ఈ అంశంలో కోర్టులో విచారణ జరిపి తీర్పు కూడా వచ్చింన్నారు. ప్రతిపక్షాలకు కేవలం ఆరోపణలు చేయడం మాత్రమే వచ్చని విమర్శించారు. హిండెన్ బర్గ్, బీబీసీ డాక్యుమెంటరీ నేపథ్యంలో మోడీపై ఏదైనా కుట్ర జరుగుతోందా అని అడగగా మోడీపై 2002 నుంచి కుట్రలు, అసత్యాలు ప్రచారం జరుగుతూనే ఉన్నాయని.. మోడీ మాత్రం సూర్యుడిలా మరింత ప్రకాశిస్తున్నాడని చెప్పారు.
ఇవి కూడా చదవండి : బిగ్ బ్రేకింగ్ : బీబీసీ ఢిల్లీ కార్యాలయంలో ఐటీ సోదాలు..