కర్ణాటక.. బీజేపీ రెండో విడత అభ్యర్థుల జాబితా విడుదల

by Mahesh |
కర్ణాటక.. బీజేపీ రెండో విడత అభ్యర్థుల జాబితా విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతూండటంతో అన్ని పార్టీల నేతలు తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో పడ్డాయి. ఈ క్రమంలోనే బీజేపీ మొదట 189 మందితో మొదటి లిస్ట్ ను విడుదల చేయగా.. నిన్న రాత్రి రెండో లిస్ట్ లో మరో 23 మంది అభ్యర్థులతో కూడిన జాబితను విడుదల చేసింది. దీంట్లో.. కోలార్ గోల్డ్ ఫీల్డ్ నియోజకవర్గం నుంచి అశ్విని సంపంగి, గుర్మిట్‌కల్ నియోజకవర్గం నుంచి లలిత అనపూర్‌లను బీజేపీ పోటీకి దింపింది. బీదర్ నుంచి ఈశ్వర్ సింగ్ ఠాకూర్, దావణగెరె సౌత్ నుంచి అజయ్ కుమార్, గుబ్బి నుంచి ఎస్ డీ దిలీప్ కుమార్ లను కూడా పార్టీ బరిలోకి దించింది.

Advertisement

Next Story