- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భయపెడుతున్న తాజా నివేదిక.. కరోనా కంటే డేంజర్ వైరస్
దిశ, వెబ్‌డెస్క్: 2020 లో వచ్చిన కరోనా ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే. నేటికి ఈ వైరస్ పూర్తిగా అంతం కాకపోయినప్పటికీ ఎక్కడో ఒక చోట పంజా విసురుతూనే ఉంది. వాతావరణానికి తగ్గట్టు రూపాంతరం చెందిన ఈ వైరస్ లక్షల మంది ప్రజల ప్రాణాలు తీసింది. అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. ఘోరమైన కరోనా వైరస్ కంటే 100 రేట్ల ప్రమాదకరంగా బర్డ్ ఫ్లూ విస్తరించే అవకాశం ఉందని తాజా నివేదికలు తెలుపుతున్నాయి. కాగా కొత్తగా వస్తున్న బర్డ్ ఫ్లూ వేరియంట్ H5N1 వైరస్ టెక్సాస్(US)లో ఓ కార్మికుడికి సోకి అతని ఆరోగ్యం పూర్తిగా విషమించింది. ఈ వైరస్ బారిన పడ్డ అతని కళ్లు ఎర్రగా మారిపోవడంతో ఐసోలేషన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తిగా పక్షలకు వచ్చిన ఈ వైరస్ తాజాగా మనుషులకు వ్యాపిస్తుంది. ఇదే గనుక పెరిగిపోతే.. మరణాల రేటు భారీగా పెరిగే అవకాశం ఉందని ఆ దేశ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.