- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రముఖ నటుడికి బిగ్ షాక్.. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ నటుడు (Popular actor), మనవతావాది సోనుసూద్ (Sonu Sood)కు గట్టి షాక్ తగిలింది. పంజాబ్ (Panjab)లోని లుథియానా కోర్టు (Ludhiana court) ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ (non-bailable warrant) జారీ చేసింది. సోనుసూద్ ను అరెస్ట్ (arrest) చేసి కోర్టు (court)లో హజరు (produce) పరచాలని పోలీసుల (Mumbai Police)కు ఆదేశాలు (ordered) జారీ అయ్యాయి. ఓ కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి రాలేదని కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. లుథియానాకు చెందిన రాజేశ్ ఖన్నా (Rajesh Khanna) అనే న్యాయవాది (lawyer)ని, మోహిత్ శర్మ (Mohit Sharma) అనే వ్యక్తి రూ. 10 లక్షలు మోసం చేశాడని కోర్టులో కేసు వేశారు. దీనికి సూనుసూద్ సాక్షి (witness) అని పిటిషన్ (petition)లో పేర్కొన్నారు. రిజికా కాయిన్ (Rijika Coin) పేరుతో తనతో పెట్టుబడి (invested) పెట్టించినట్లు వెల్లడించారు.
ఈ పిటిషన్ పై విచారణ (hearing) చేపట్టిన లుథియానా మేజిస్ట్రేట్ (Luthiayana Megistrate) రమన్‌ప్రీత్ కౌర్ (Raman Preeth kour) కోర్టు వాంగ్మూలం ఇచ్చేందుకు రావాలని సోనుసూద్‌కు పలుమార్లు నోటీసులు పంపారు. సోనుసూద్ హజరుకాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ.. ఉత్తర్వులు ఇచ్చారు. ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచాలని ముంబైలోని అందేరి వెస్ట్ లో ఉన్న ఒషివారా పోలీస్ స్టేషన్ కు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ కేసు విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా (postponed) వేస్తున్నట్లు తెలిపారు. ఇక నటుడు సోనుసూద్ కు అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో ఆయన అభిమానులు షాక్ కు గురయ్యారు. కాగా సోనుసూద్ మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకోవడమే గాక గొప్ప మానవతావాదిగా ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ.. నిత్యం సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. కోవిడ్ సమయంలో ఆయన దాతృత్వం చూపించి ఎంతో మందికి సహాయం చేశారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ షెడ్యూల్ లో ఉన్నారు.