ఆర్థిక కష్టాల్లో ఉన్న గో ఫస్ట్‌కు భారీ ఉపశమనం!

by Javid Pasha |
ఆర్థిక కష్టాల్లో ఉన్న గో ఫస్ట్‌కు భారీ ఉపశమనం!
X

న్యూఢిల్లీ: ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రముఖ విమానాయన సంస్థ గో ఫస్ట్‌కు భారీ ఉపశమనం లభించింది. సంస్థకు దాదాపు రూ. 400 కోట్ల మధ్యంతర నిధులు సమకూర్చేందుకు బ్యాంకులు ఆమోదించినట్టు తెలుస్తోంది. గత నెలలో గో ఫస్ట్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) ముందు స్వచ్ఛంద దివాలా పరిష్క్ర ప్రక్రియ కోసం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నగదు కొరత కారణంగా సంస్థ తన విమానాలను రద్దు చేసింది. ఈ క్రమంలోనే దేశీయ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు నిధుల కోసం ప్రయత్నిస్తోంది.

తాజాగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, డాయిష్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంకులతో కూడిన కమిటీ ఆఫ్ క్రెడిటర్స్(సీఓసీ) అదనపు నిధుల కోసం చేసిన అభ్యర్థనను ఆమోడించింది. ఈ నిధులద్వారా గో ఫస్ట్ వ్యాపార కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు వీలవుతుంది. ఆమోదించిన రూ. 400-450 కోట్ల నిధులను దశల వారీగా అందించనున్నట్టు సమాచారం.

Advertisement
Next Story

Most Viewed