Trains Cancelled:రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్‌..రేపు పలు రైళ్లు రద్దు

by Jakkula Mamatha |   ( Updated:2024-08-02 14:32:33.0  )
Trains Cancelled:రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్‌..రేపు పలు రైళ్లు రద్దు
X

దిశ,వెబ్‌డెస్క్: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్ జారీ చేసింది. పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తాజాగా వెల్లడించారు. వివరాల్లోకి వెళితే..సికింద్రాబాద్‌ పరిధిలో పూణె డివిజన్‌‌లో వచ్చే మూడు రోజుల పాటు పలు రైళ్లు రద్దయినట్లు అధికారులు వివరించారు. దౌండ్‌లో ఇంటర్‌లాకింగ్ పనిని నిర్వహించడానికి సెంట్రల్ రైల్వే మూడు రోజుల పాటు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో పూణె డివిజన్‌లో ఈ నెల 29 నుంచి 31 వరకు 62 రైళ్లు రద్దయ్యాయి.

29, 30 తేదీల్లో రద్దైన రైళ్లు వివరాలు..

జులై 29వ తేదీన 12025 పూణె-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్, 12169 పూణే-సోల్పూర్ ఎక్స్‌ప్రెస్, 01511 పూణే-బారామతి DMU, 01487 పూణే-హరంగుల్ TOD ఎక్స్‌ప్రెస్, 11406 అమరావతి-పూణే ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు కానున్నట్లు సమాచారం. ఈ క్రమంలో జులై 30వ తేదీన 17613 పన్వెల్-నాందేడ్ ఎక్స్‌ప్రెస్, రైలు నెం 11421 హడప్సర్-సోలాపూర్ DMU ఎక్స్‌ప్రెస్‌, రైలు నెం 11409 దౌండ్-నిజాంబాద్ DMU ఎక్స్‌ప్రెస్, రైలు నెం 01522 డౌండ్-హడప్సర్ DMU, 12220 సికింద్రాబాద్-లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రద్దైన రైళ్లు వివరాలు జులై 29న మొత్తం 15 రైళ్లు, జులై 30న 23 రైళ్లు, జులై 31న 24 రైళ్లు రద్దు కానున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed