రెండో టెస్టులో రెండు వికెట్లు కోల్పోయిన బంగ్లా

by Y. Venkata Narasimha Reddy |
రెండో టెస్టులో రెండు వికెట్లు కోల్పోయిన బంగ్లా
X

దిశ, వెబ్ డెస్క్ : కాన్పూర్ వేదికగా ప్రారంభమైన రెండో టెస్టులో బంగ్లాదేశ్ టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తుంది. వర్షం పడడంతో టాస్ ఆలస్యమైంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో మొదట బ్యాటింగ్ కు దిగిన బంగ్లా ఓపెనర్లు తొలి గంట సేపు భారత పేస్ బౌలింగ్ త్రయం బుమ్రా, సిరాజ్,ఆకాష్ దీప్ పదునైన బంతులను ఆచితూచి ఆడారు. దీంతో పరుగుల వేగం మందగించింది. అయితే ఓపెనర్లు ఇద్దరు స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో బంగ్లాదేశ్ 29 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. రెండు వికెట్లు ఆకాష్ దీప్ కే దక్కాయి. మ్యాచ్ లో బంగ్లా ఓపెనర్ జాకీర్ హసన్ తన జిడ్డు బ్యాటింగ్ తో విసిగించాడు. వికెట్ కోల్పోవద్దన్న పట్టుదలతో ఆడిన హసన్ బుల్లెట్ లా దూసుకొస్తున్న బుమ్రా, సిరాజ్, ఆకాష్ దీప్ బంతుల నుంచి వికెట్ కాపాడుకునే క్రమంలో 24 బంతులాడి ఒక్క పరుగు చేయకుండానే డకౌట్ గా పెవిలియన్ కు చేరాడు. ఆకాష్ దీప్ బౌలింగ్ లో జైశ్వాల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్

షాద్మన్ ఇస్లాంను కూడా ఆకాష్ దీప్ ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ కు పంపాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ లంచ్ సమయానికి 26 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. కెప్టెన్ శాంటో (28), మోమినుల్ హక్ (17) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed