- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'బీఎస్ 3, బీఎస్ 4 వాహనాలను నిషేధించాలి'
న్యూఢిల్లీ : హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ పరిధిలోని నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్)లో నాసిరకం డీజిల్‌తో నడిచే బస్సులపై కఠిన నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్‌రాయ్ డిమాండ్ చేశారు. ఢిల్లీ పరిధిలోని బస్సులన్నీ సీఎన్జీ, విద్యుత్తుపైనే నడుస్తుండగా.. హర్యానా, యూపీ, రాజస్థాన్‌లలోని ఎన్సీఆర్ రీజియన్‌లో బీఎస్ 3, బీఎస్ 4 మోడల్ వాహనాలు ఇంకా నడుస్తున్నాయని చెప్పారు. ఢిల్లీలోని కశ్మీర్ గేట్ ఇంటర్‌స్టేట్ బస్ టెర్మినల్ వద్ద తాను నిర్వహించిన ఆకస్మిక తనిఖీలోనూ ఇదేవిషయం బహిర్గతమైందన్నారు. దేశ రాజధానిలో కాలుష్యాన్ని తగ్గించాలని భావిస్తే.. వెంటనే ఇక్కడ బీఎస్ 3, బీఎస్ 4 మోడల్ వెహికల్స్ వినియోగాన్ని బ్యాన్ చేయాలని కేంద్రాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (సీఏక్యూఎం) జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. నవంబర్ 1 నుంచి ఎలక్ట్రిక్, సీఎన్జీ, బీఎస్6 మోడళ్ల డీజిల్ బస్సులు మాత్రమే ఎన్సీఆర్ ప్రాంతంలో రాకపోకలు సాగించాలి.