Bail orders: అసాధారణ కేసుల్లో మాత్రమే బెయిల్‌పై స్టే విధించాలి..సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

by vinod kumar |   ( Updated:2024-07-23 11:16:32.0  )
Bail orders: అసాధారణ కేసుల్లో మాత్రమే బెయిల్‌పై స్టే విధించాలి..సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: అసాధారణ కేసుల్లో మాత్రమే హైకోర్టులు బెయిల్ ఉత్తర్వులపై స్టే విధించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సాధారణ కేసుల్లో బెయిల్‌ను ఆపకూడదని స్పష్టం చేసింది. మనీలాండరింగ్ కేసులో నిందితుడైన పర్వీందర్ సింగ్ ఖురానాకు ట్రయల్ కోర్టు బెయిల్‌ మంజూరు చేయగా..దీనికి వ్యతిరేకంగా ఈడీ హైకోర్టును ఆశ్రయించగా ట్రయల్ కోర్టు ఆర్డర్స్ పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. దీంతో పర్విందర్ సింగ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ అభయ్ సింగ్ ఓకా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.

ఖురానా బెయిల్ ఆర్డర్‌ను సుమారు ఏడాది పాటు నిలిపివేయడం పట్ల ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. బలమైన సాక్ష్యాధారాలు లేకుండా నిందితుడికి ఇంత కాలం బెయిల్ నిరాకరించి ఏం సందేశం ఇస్తున్నారని ఢిల్లీ హైకోర్టును ప్రశ్నించింది. ఒక వ్యక్తి స్వేచ్ఛను హరించలేమని, అలా అయితే అది వినాశనానికి దారి తీస్తుందని తెలిపింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను కొట్టివేస్తూ పిటిషనర్‌కు బెయిల్ మంజూరు చేసింది. చాలా అరుదైన కేసుల్లో మాత్రమే బెయిల్‌పై స్టే విధించాలని సూచించింది. నిందితులపై ఉగ్రవాదం, దేశద్రోహం వంటి కేసులు ఉంటే స్టే విధించొచ్చని పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed