- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్: తదుపరి విచారణ ఏప్రిల్ 13న
దిశ, వెబ్ డెస్క్: పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి గుజరాత్‌లోని సూరత్ సెషన్స్ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. పరువు నష్టం కేసులో శిక్షపై ఆయన చేసిన అప్పీల్‌ను కోర్టు ఏప్రిల్ 13న విచారించనుంది. 'దొంగలు' అదే ఇంటి పేరును ఎలా ఎంచుకున్నారని వ్యాఖ్యానిస్తూ.. పారిపోయిన ఇద్దరు వ్యాపారవేత్తలతో ప్రధాని మోదీ ఇంటి పేరును ముడిపెట్టి ప్రసంగించినందుకు రాహుల్ గాంధీని దిగువ కోర్టు దోషిగా నిర్ధారించింది. అదేవిధంగా గత నెలలో రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది.
సదరు తీర్పుపై అప్పీలు చేసుకునేందుకు కోర్టు అతనికి 30 రోజుల పాటు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే రాహుల్ లోక్‌సభ సభ్యుడిగా అనర్హుడయ్యాడు. దిగువ కోర్టు తీర్పుపై అప్పీల్ చేసేందుకు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి ప్రత్యేక విమానంలో ఈ రోజు సూరత్ చేరుకున్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని దోషిగా నిర్ధారించిన కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను నిలిపివేయాలని కోరారు.
అయితే, సెషన్స్ కోర్టు దోషిపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రతివాది వాదన వినకుండానే ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని కోర్టు పేర్కొంది. ఏప్రిల్ 10లోగా స్పందించాలని ఈ కేసులో ఫిర్యాదు దారుడికి నోటీసులు జారీ చేసింది. రాహుల్ కు బెయిల్ మంజూరు చేసిన సెషన్స్ కోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 13కి వాయిదా వేసింది.