బిగ్ న్యూస్: పరువు నష్టం కేసులో మాజీ MP రాహుల్ గాంధీకి ఊరట

by Satheesh |
Rahul Gandhi does not seem to be taking charge as Congress Chief
X

దిశ, డైనమిక్ బ్యూరో: పరువు నష్టం కేసులో కాగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఈ కేసులో సూరత్ సెషన్స్ కోర్టు రాహుల్ గాంధీ బెయిల్ పొడిగించింది. తనపై నమోదైన కేసులో దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సోమవారం సూరత్ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రెండేళ్ల జైలు శిక్ష రద్దు చేయాలని ఈ పిటిషన్‌లో కోరారు.

దీంతో ఈ కేసులో సెషన్స్ కోర్టు రాహుల్‌కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఏప్రిల్ 13 వరకు బెయిల్ ఇచ్చింది. తదుపరి విచారణను మే 3వ తేదీకి వాయిదా వేసింది. అంతకు ముందు సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి సూరత్‌కు వచ్చారు. రాహుల్‌కు మద్దతుగా పార్టీ నేతలు పెద్ద ఎత్తున వచ్చారు.


Next Story

Most Viewed