Chotu Baba: 32 ఏళ్లుగా స్నానం చేయని చోటూ బాబా.. ఆయన అన్ని సంవత్సరాలు ఎలా ఉండగలిగారు?

by Prasanna |   ( Updated:2025-02-01 02:53:17.0  )
Chotu Baba: 32 ఏళ్లుగా స్నానం చేయని చోటూ బాబా.. ఆయన అన్ని సంవత్సరాలు ఎలా ఉండగలిగారు?
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రయాగ్‌రాజ్‌లో ( Prayagraj ) గల త్రివేణి సంగమం వద్ద కుంభమేళా ( Kumbhamela ) ఘనంగా జరుగుతుంది. గంగా నదిలో ( Ganga River ) పవిత్ర స్నానాలు ఆచరించేందుకు భక్తులు పోటెత్తారు. ఈ ఆధ్యాత్మిక పండగలో భక్తులతో పాటు, సాధువులు, సన్యాసులు పాల్గొన్నారు. ఇప్పటికే, వారికీ సంబంధించిన ఎన్నో వార్తలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే, ఓ ఆధ్యాత్మిక గురువు మీడియానే షేక్ చేస్తున్నారు. ఆయన 32 ఏళ్ళ నుంచి స్నానం చేయలేదు. దీంతో, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. ఆయన ఎవరు? ఇన్ని సంవత్సరాలు స్నానం చేయకుండా ఆరోగ్యంగా ఎలా ఉండగలిగారనేది ఇక్కడ తెలుసుకుందాం..

ఆయనే ఛోటూ బాబా.. ( chotu baba ) పూర్తి పేరు గంగాపురి మహరాజ్ ( Gangapuri Maharaj) . ఈయన చాలా ప్రసిద్ధి చెందిన ఆథ్యాత్మిక గురువు ( spiritual teacher ) అస్సాంకు చెందిన ఈ సన్యాసి గత 32 ఏళ్లుగా స్నానం చేయలేదు. మహాకుంభమేళాలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనను మీడియా పలు ప్రశ్నలు అడగడంతో ఈ విషయం తెలిసింది.

ఎందుకు స్నానం చేయడం లేదంటే?

గత 32 ఏళ్లుగా ఎందుకు స్నానం చేయడం లేదో ఆయనే స్వయంగా మీడియాకి వెల్లడించారు. ఓ ముఖ్యమైన కోరిక ఉందని, ఆ కోరిక తీరే వరకు స్నానం చేయకూడదని నిర్ణయం తీసుకున్నాను.. ఈ మహా కుంభమేళాలో తమ ఆత్మను పరమాత్మతో అనుసంధానించుకోవడమే అతని లక్ష్యమని తెలిపారు.

ఆధ్యాత్మిక కారణం

ఇక్కడ ఛోటూ బాబా ( chotu baba ) ఆధ్యాత్మిక కారణాలు ( spiritual ) చెప్పినప్పటికీ, వైద్య నిపుణులు మాత్రం దీనిని తప్పు బడుతున్నారు. ఎందుకంటే, స్నానం చేయడం శరీర శుభ్రతకు ఎంతో ముఖ్యమని అంటున్నారు. ఆధ్యాత్మికత , శారీరక ఆరోగ్యం రెండూ అవసరమే. ఈ విషయం సమాజంలో విభిన్న అభిప్రాయాలకు దారితీసింది. కొంతమంది ఆయనను ఆధ్యాత్మిక గురువుగా భావిస్తే, మరికొంతమంది ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఇలా చేయడం మంచి పద్ధతి కాదంటూ విమర్శిస్తున్నారు.


Next Story

Most Viewed