- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిక్కీంలో హిమపాతం
న్యూఢిల్లీ: సిక్కింలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన సొంగ్మోలో విషాద సంఘటన చోటు చేసుకుంది. 17వ మైలు వద్ద సంభవించిన హిమపాతం వల్ల అనేక మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. వీరిని రక్షించేందుకు రాజధాని నగరం గ్యాంగ్‌టక్ పోలీసులు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్ఎఫ్), వాలంటీర్ల బృందం రంగంలోకి దిగింది. హిమపాతం సంభవించినప్పుడు ఆ ప్రాంతంలో 150 మందికి పైగా పర్యాటకులు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాథమిక సమాచారాన్ని బట్టి మంగళవారం మధ్యాహ్నం 12.20 నిమిషాలకు ఈ సంఘటన జరిగింది.
ఈ హిమపాతం ఘటనలో నలుగురు పురుషులు, ఒక మహిళ, ఒక చిన్నారి తీవ్రంగా గాయపడి మృతిచెందారు. వీరు ప్రయాణిస్తున్న టూరిస్టు బస్సు లోయలో పడింది. వీరికి 13వ మైలు వరకు అనుమతి ఉంది. కానీ వీరు 15వ మైలు వరకు వెళ్లడంతో ఈ ఘటన జరిగింది. గాయపడిన మరో ఆరేడుగురిని గ్యాంగ్‌టక్‌లోని ఎస్‌టీఎన్ఎం ఆస్పత్రికి ఆంబులెన్స్ ద్వారా తరలించారు. జేఎన్ రోడ్ ట్యాక్సీ డ్రైవర్లు, టూరిజం అధికారులు, బిఆర్ఓ గ్రీఫ్, ఇతర వాలంటీర్లు ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నారు. జేఎన్ఎం రోడ్ 14వ మైలు వద్ద 25 నుంచి 30 మంది పర్యాటకులు ఈ హిమపాతంలో చిక్కుకున్నారు. 22 మందిని రక్షించారు. ఆరుగురిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. మంచులో కూరుకుపోయినప్పటికీ శ్వాస తీసుకుంటున్న ఓ మహిళను కూడా రక్షించి ఆస్పత్రికి తరలించారు. రోడ్డుపై ఉన్న మంచును తొలగించిన తర్వాత 350 మంది పర్యాటకులను, 80 వాహనాలను రక్షించారు.