- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘స్పెక్ట్రమ్’ బేస్ ధర రూ.96,317 కోట్లు.. 20 ఈఎంఐలలో కట్టుకోవచ్చు !!
దిశ, నేషనల్ బ్యూరో : 2జీ స్పెక్ట్రమ్‌ను వేలం విధానంలో కాకుండా నేరుగా తామే కేటాయిస్తామంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వేలం ద్వారానే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు జరపాలంటూ 2012లో ఇచ్చిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు మోడీ సర్కారు విజ్ఞప్తిచేసింది. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి మరో కొత్త విషయం తాజాగా బుధవారం ఉదయం బయటికి వచ్చింది. ‘‘టెలికాం స్పెక్ట్రమ్‌ను వేలం వేసే ప్రక్రియను కొనసాగించాలని కేంద్రం భావిస్తోంది. వేలం వేసేందుకు టెక్నికల్‌గా ఆటంకాలున్న సందర్భాల్లోనే నేరుగా స్పెక్ట్రమ్ కేటాయింపులు జరపాలని ప్రభుత్వం అనుకుంటోంది. దేశ ప్రయోజనాలతో ముడిపడి ఉండే వ్యూహాత్మక ప్రాంతాలకు సంబంధించిన స్పెక్ట్రమ్ కేటాయింపులను నేరుగా తామే చేపట్టాలని కేంద్ర సర్కారు యోచిస్తోంది’’ అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. టెలికాం శాఖ తదుపరిగా ఎనిమిది స్పెక్ట్రమ్ బ్యాండ్‌లను జూన్ 6న వేలం వేయనుంది. దీనికి బేస్ ధర దాదాపు రూ.96,317 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ వేలంలో గరిష్ఠ ధరను చెల్లించే కంపెనీకి స్పెక్ట్రమ్‌ను 20 సంవత్సరాల వ్యవధి కోసం కేటాయిస్తారు. సదరు కంపెనీ 20 ఈఎంఐలలో వేలం ధరను కేంద్ర టెలికాం శాఖకు చెల్లించాల్సి ఉంటుంది.