నియంత్రణ రేఖ వద్ద చొరబాటుకు యత్నం.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

by vinod kumar |
నియంత్రణ రేఖ వద్ద చొరబాటుకు యత్నం.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా సమీపంలో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. వీరు కెరాన్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి భారత్‌లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించగా వారిపై కాల్పులు జరిపినట్టు శ్రీనగర్‌కు చెందిన చినార్ కార్ప్స్ ఆఫ్ ఆర్మీ వెల్లడించింది. టెర్రరిస్టుల నుంచి పిస్టల్స్, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. చొరబాటు నిరోధక చర్యలు కొనసాగుతున్నాయని ఆర్మీ అధికారులు తెలిపారు. అయితే ఉగ్రవాదుల వివరాలను వెల్లడించలేదు. అంతకుముందు భద్రతా దళాలు చొరబాటు బిడ్‌ను విఫలం చేయడానికి కుప్వారాలోని కెరాన్ సెక్టార్‌లో ధనుష్ II అనే పేరుతో ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఈ క్రమంలోనే ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. కాగా, జమ్మూ కశ్మీర్‌లో ఇటీవల వరుస ఉగ్రదాడులు జరిగాయి. ఈ ప్రాంతంలోని కథువా, దోడా, రియాసి, ఉధంపూర్ జిల్లాల్లోని 4 ప్రదేశాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో ఉగ్రవాదులతో సహా ఆర్మీ జవాన్లు సైతం ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

Next Story