నిందితుడికి అనుకూలంగా తీర్పు ఇవ్వలేదని జడ్జిపై ఎటాక్ (వీడియో వైరల్)

by Shiva |
నిందితుడికి అనుకూలంగా తీర్పు ఇవ్వలేదని జడ్జిపై ఎటాక్ (వీడియో వైరల్)
X

దిశ, డైనమిక్ బ్యూరో : అనుకూలంగా తీర్పు ఇవ్వలేదని కోర్టులోనే జడ్జిపై ఓ నిందితుడు దాడికి పాల్పడిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. డియోబ్రా రెడ్‌‌డెన్(30) అనే నిందితుడికి శిక్ష విధిస్తూ న్యాయమూర్తి మేరి కే హోల్థస్ తీర్పు చదవడం ప్రారంభించింది. అయితే, తీర్పు తనకు వ్యతిరేకంగా ఉండటంతో కోపోద్రిక్తుడైన నిందితుడు మెరుపు వేగంతో బల్లపై నుంచి జంప్ చేసి జడ్జిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఆకస్మిక ఘటనతో కోర్టు హాలులో ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే కోర్టు సిబ్బంది న్యాయమూర్తి రక్షించారు. ఈ ఘటనలో జడ్జితో ఇద్దరు కోర్టు మార్షల్స్‌కు గాయాలైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story