బీటలు వారిన అటల్ సేతు.. హీరోయిన్ రశ్మిక మంధనాపై ట్రోల్స్

by Ramesh Goud |
బీటలు వారిన అటల్ సేతు.. హీరోయిన్ రశ్మిక మంధనాపై ట్రోల్స్
X



దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో సమద్రంపై నిర్మించిన అతి పెద్ద వంతెనగా పేరు నమోదు చేసుకున్న అటల్ సేతుకు పగుళ్లు వచ్చాయి. ఈ ఏడాది జనవరిలో ప్రధాని నరేంద్ర మోడీ దీనిని ప్రారంభించారు. మహారాష్ట్రలో సముద్రం పై 21.8 కిలోమీటర్ల పొడవున ఆరు లేన్లతో ఈ వంతెనను నిర్మించారు. 18 వేల కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ వంతెన ముంబై, నవీ ముంబైల మధ్య ప్రయాణించే సమయాన్ని 2 గంటల నుంచి 20 నిమిషాలకు తగ్గించింది. అయితే ఇటీవల కురిసిన వర్షానికి ఈ అటల్ సేతు వంతెనకు పగుళ్లు వచ్చాయి. దాదాపు కొన్ని మీటర్ల మేర రోడ్డుకు బీటలు వచ్చాయి. దీంతో ప్రారంభించిన ఐదు నెలల్లోనే ఈ వంతెనకు పెద్ద ఎత్తున పగుళ్లు రావడం పలు విమర్శలకు తావిస్తుంది.

దీనిని ఇవ్వాళ మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే సందర్శించారు. దీనిపై మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు చిన్న వర్షానికే బీటలు వారడం ఏంటని, దేశంలోనే అత్యంత పొడవైన బ్రిడ్జి ఎంత నాణ్యతతో నిర్మించారో అర్ధం అవుతుందని మహారాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు విమర్శలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున పగుళ్లు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని నిరసన వ్యక్తం చేస్తోంది. దీనికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు హీరోయిన్ రశ్మిక మంధనాను ట్రోల్ చేస్తున్నారు. కాగా ఎన్నికల సమయంలో దీనిని చూపిస్తూ మోడీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించింది. దీంతో ఈ వీడియోలు పోస్ట్ చేస్తూ.. రశ్మిక మంధనాను ఆడుకుంటున్నారు. రశ్మిక ఇప్పడు కూడా వీడియోలు చేయాలని, వేర్ ఈజ్ రశ్మిక అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed