Assembly Election Schedule: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 4న ఫలితాలు

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-16 10:30:13.0  )
Assembly Election Schedule: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 4న ఫలితాలు
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్‌, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం ప్రెస్‌నోట్ విడుదల చేసింది. మొత్తం మూడు దశల్లో జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. అక్టోబర్ 1న హర్యానాలో ఎన్నికలు జరుగనున్నాయి. అక్టోబర్ 4వ తేదీనే రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. జమ్మూకశ్మీర్‌లో 90 స్థానాలకు, హర్యానాలో 90 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed