Ashwini Vaishnaw: రాజ్యాంగంపై ప్రధాని మోడీ నిబద్దతను చాటారు.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

by vinod kumar |
Ashwini Vaishnaw: రాజ్యాంగంపై ప్రధాని మోడీ నిబద్దతను చాటారు.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
X

దిశ, నేషనల్ బ్యూరో: లేటరల్ ఎంట్రీ నియామకాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగంపై ప్రధాని మోడీ తన నిబద్ధతను ప్రతిబింబించారని కొనియాడారు. సామాజిక న్యాయం పట్ల మోడీ నిరంతరం శ్రద్ద చూపెడుతున్నారని తెలిపారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం ఎంతో కీలకమైందని చెప్పారు. మోడీ నాయకత్వంలో నీట్, సైనిక్ స్కూల్స్, ఇతర విద్యాసంస్థల్లో అడ్మిషన్లకు రిజర్వేషన్ సూత్రాలు వర్తింపజేసేలా ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు.

సమాజంలోని అత్యంత అట్టడుగు వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు చేరవేయాలనే లక్ష్యంతో మోడీ పనిచేస్తున్నారన్నారు. దీని ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలు అత్యధిక ప్రయోజనాలు పొందాయని వెల్లడించారు. ‘2014కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో రిజర్వేషన్ సూత్రాలపై దృష్టి సారించే వారు కాదు. ఆర్థిక కార్యదర్శులు లేటరల్ ఎంట్రీ ద్వారా విధుల్లో చేరారు. అంతేగాక రిజర్వేషన్ సూత్రాన్ని సైతం పరిగణనలోకి తీసుకోలేదు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, అప్పటి ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా లేటరల్ ఎంట్రీ రూల్ ద్వారానే సర్వీసులోకి ప్రవేశించారు’ అని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed