- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
లైంగికదాడి కేసులో ఆశారాం బాపుకు జీవిత ఖైదు

X
గాంధీనగర్: లైంగిక దాడి కేసులో స్వయం ప్రకటిత దైవంగా పేరొందిన ఆశారాం బాపుకు జైలు శిక్ష ఖరారైంది. 2013 కేసులో జీవిత ఖైదు విధిస్తూ మంగళవారం గుజరాత్ సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో బాపుతో పాటు ఆయన భార్య, ఆమె సోదరి, కొడుకుల ప్రమేయం ఉన్నట్లు బాధిత మహిళ ఆరోపించింది. బాపు కుమారుడు నారాయణ్ సాయికి 2019లోనే జీవిత ఖైదు విధించింది. ఆశారాం తనపై ఏళ్లుగా లైంగిక దాడికి పాల్పడ్డాడని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై 2013లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో 68 మంది విచారించారు. అధికారులకు దర్యాప్తులో బెదిరింపుల వచ్చాయని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే మరో కేసులో ఆయన జైలులో ఉన్నారు.
Next Story