Kumbh Mela: ముగింపు దశకు కుంభమేళా.. యూపీ సర్కారుకు అఖిలేష్ వినతి

by Shamantha N |
Kumbh Mela: ముగింపు దశకు కుంభమేళా.. యూపీ సర్కారుకు అఖిలేష్ వినతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా (Kumbh Mela)ముగింపు దశకు చేరుకుంది. మరో పదకొండు రోజుల్లో కుంభమేళా ముగియనుంది. అయితే, జనాలు భారీగా రావడంతో ప్రయాగ్ రాజ్ సంగమ్ రైల్వే స్టేషన్ ను మూసివేశారు. ఈ నేపథ్యంలో యూపీ సర్కారుకు సమాజ్ వాదీ పార్టీ అధినేత, ఎంపీ అఖిలేష్ యాదవ్ ఓ అభ్యర్థనను చేశారు. ‘‘గతంలో కుంభమేళాను 75 రోజులు కూడా నిర్వహించారు. కానీ, ఇప్పుడు తక్కువ గడవు ఉంది. అందరూ మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేయాలనుకుంటున్నారు. కానీ, వెళ్లలేకపోతున్నారు. కుంభమేళా గడవుని పెంచాలి’’ అని యాదవ్‌ సూచించారు.

గంగాస్నానం ఆచరించిన 50 కోట్ల మంది

ఇకపోతే, ఇప్పటికే 50 కోట్లమందికి పైగా గంగాస్నానం చేసినట్లు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం వెల్లడించింది. కుంభమేళాలో పాల్గొనేందుకు వస్తున్న వారితో రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి. రైళ్లల్లో స్థలం లేకుండా పోయింది. రికార్డు స్థాయిలో 350 కి.మీ. మేర వాహనాలు బారులు తీరాయి. ఈ నేపథ్యంలోనే కుంభమేళా గడవు పెంచాలని అఖిలేష్ యాదవ్ యూపీ సర్కారును కోరారు. ప్రతి 12 ఏళ్లకు ఓసారి నిర్వహించే ఈ మహా కుంభమేళా జనవరి 13న మొదలు కాగా.. ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. మొత్తం 40 నుంచి 45 కోట్ల మంది రావచ్చని గతంలో అంచనా వేశారు. కానీ, అంచనాలకు మించి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు వస్తున్నారు.

Next Story

Most Viewed