Arvind Kejriwal: రాజ్యసభకు కేజ్రీవాల్.. క్లారిటీ ఇచ్చిన ఆప్

by Shamantha N |
Arvind Kejriwal: రాజ్యసభకు కేజ్రీవాల్.. క్లారిటీ ఇచ్చిన ఆప్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) రాజ్యసభకు(Rajya Sabha) వెళ్లనున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. కాగా.. కేజ్రీవాల్ పార్లమెంటు (Parliament) కు వెళ్తారనే ప్రచారాన్ని ఆప్ కొట్టిపారేసింది. అర్వింద్‌ కేజ్రీవాల్‌ రాజ్యసభకు వెళ్లడం లేదని, అవన్నీ ఆధారంలేని ఊహాగానాలని ఆప్‌ అధికార ప్రతినిధి ప్రియాంకా కక్కర్‌ చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ ఆప్ జాతీయ కన్వీనర్ అని.. ఆయన డిమాండ్ చాలా ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చారు. కానీ ,ఆయన ఏ ఒక్క స్థానానికి పరిమితం కాలేదని వెల్లడించారు. ఇదంతా మీడియా చేస్తున్న అసత్య ప్రచారమని ఆమె తోసిపుచ్చారు. గతంలోనూ ఇలాంటి అసత్యాలే ప్రచారం చేశారని గుర్తుచేశారు. ఆయన పంజాబ్‌ ముఖ్యమంత్రి కాబోతున్నారనే ప్రచారం జరిగిందని కక్కర్‌ గుర్తుచేశారు. ఇప్పుడు రాజ్యసభకు వెళ్తున్నారనే ప్రచారం జరుగుతోందని, ఇవన్నీ ఊహాగానాలే అని ఆమె కొట్టిపారేశారు.

రాజ్యసభకు కేజ్రీవాల్..!

కాగా పంజాబ్‌కు ఆప్‌ ఎంపీ సంజీవ్‌ అరోరా లూథియానా అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో ఆప్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. లుథియానా వెస్ట్ నుంచి ఎన్నికైనా ఆప్ ఎమ్మెల్యే గుర్ ప్రీత్ గోగి గతనెల చనిపోయారు. దీంతో, ఆ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో, ఆప్ సంజీవ్ ను బరిలోకి దింపింది. ఆయన ఉపఎన్నికలో గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, అదే నిజమైంతే రాజ్యసభ స్థానం ఖాళీ కానుంది. దీంతో, సంజీవ్‌ అరోరాను పంజాబ్‌ అసెంబ్లీకి పంపి, ఆయన స్థానంలో రాజ్యసభ సభ్యుడిగా కేజ్రీవాల్ పార్లమెంట్‌లో అడుగుపెట్టబోతున్నారనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని తాజాగా ప్రియాంకా కక్కర్‌ కొట్టిపారేశారు.

Next Story

Most Viewed