- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వాలను కూల్చే సీరియల్ కిల్లర్ బీజేపీ : Arvind Kejriwal
న్యూఢిల్లీ: ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీని సీరియల్ కిల్లర్గా వర్ణించారు. పట్టణంలోకి సీరియల్ కిల్లర్ ప్రవేశించిందని, అన్ని ప్రభుత్వాలను కూల్చాలని చూస్తుందని విమర్శించారు. శుక్రవారం అసెంబ్లీ ప్రత్యేక సెషన్లో ఆయన ప్రసంగించారు. 'బీజేపీ పలు ప్రభుత్వాలను కూలదోసి ఢిల్లీ వైపు మళ్లింది. మన దేశంలో ప్రభుత్వాల సీరియల్ కిల్లర్ ఉంది. ఒకే విధానాన్ని అనుసరిస్తుంది' అని అన్నారు. ఈ మధ్యకాలంలో 277 మంది ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసిందని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం ఢిల్లీలో బీజేపీ "ఆపరేషన్ లోటస్" పై చర్చించడానికి సమావేశాన్ని పిలిచింది. అంతకుముందు రోజు బీజేపీ 40 మంది ఆప్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నాలు చేస్తుందని కేజ్రివాల్ ఆరోపించారు. లిక్కర్ పాలసీల్లో అవకతవకల్లో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా నివాసాల్లో 14 గంటలకు పైగా సోదాలు చేశారని తెలిపారు. అయినప్పటికీ ఎలాంటివి గుర్తించలదేదని చెప్పారు. గుజరాత్లో పోటీ చేస్తున్నామనే భయంతో ఈడీ, సీబీఐ సోదాలను ఉధృతం చేసిందని అన్నారు.
Also Read : బీజేపీ 8 రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను తొలగించింది.. కేటీఆర్ ట్వీట్
ఇవి కూడా చదవండి : మాపై సోదాలకు ఆ ఎన్నికలే కారణం: Arvind Kejriwal
- Tags
- arvind kejriwal