సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆర్మీ సిద్ధం: జనరల్ మనోజ్ పాండే

by samatah |
సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆర్మీ సిద్ధం: జనరల్ మనోజ్ పాండే
X

దిశ, నేషనల్ బ్యూరో: చైనాతో సరిహద్దు వివాదం కారణంగా తలెత్తే సవాళ్లను ఎదుర్కునేందుకు భారత్ సైన్యం సిద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే స్పష్టం చేశారు. రక్షణను బలోపేతం చేయడానికి సైన్యం అనేక చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు. లక్నోలోని 11 గూర్ఖా రైఫిల్స్ రెజిమెంట్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన ఆర్మీ డే పరేడ్‌లో ఆయన ప్రసంగించారు. సైన్యంలో అనేక అత్యాధునిక పరికరాలున్నాయని తెలిపారు. జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితి అదుపులో ఉందని కానీ రాజౌరీ, పూంచ్ సెక్టార్లలో తీవ్రవాద కార్యకలాపాలు పెరిగాయని చెప్పారు. నియంత్రణ రేఖపై కాల్పుల విరమణ అమలులో ఉందన్నారు. చొరబాట్లను అడ్డుకోవడంలో భారత సైన్యం ఎంతో కృషి చేస్తుందని కొనియాడారు. కశ్మీర్‌లోని మారుమూల ప్రాంతాల్లో భద్రతా బలగాలు తీసుకున్న చర్యలతో హింసాకాండ కొంత వరకు తగ్గిందన్నారు. ఈశాన్య ప్రాంతంలోని స్థానిక తిరుగుబాటు గ్రూపులతో భారత సైన్యం శాంతి చర్చలను విజయవంతంగా నిర్వహించిందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed