లివ్ ఇన్ రిలేషన్‌షిప్ లో ఉంటున్నారా? ఇవి పాటించాల్సిందే..! హైకోర్డు సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |   ( Updated:2025-01-29 16:14:56.0  )
లివ్ ఇన్ రిలేషన్‌షిప్ లో ఉంటున్నారా? ఇవి పాటించాల్సిందే..! హైకోర్డు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: లివ్ ఇన్ రిలేషన్‌షిప్ (live-in relationships) లపై రాజస్థాన్ హైకోర్టు (Rajasthan High Court) సంచలన వ్యాఖ్యలు చేసింది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ కోసం కాంట్రాక్ట్ తప్పనిసరి (Contract Mandatory) చేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. లివ్- ఇన్- రిలేషన్‌షిప్‌లో ఉన్న వ్యక్తులు తమకు రక్షణ (protection) కల్పించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ (petition)పై విచారణలో భాగంగా రాజస్థాన్ కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. సహజీవన సంబంధంలో ఉండే వ్యక్తులు లివ్ ఇన్ రిలేషన్ షిప్ అగ్రిమెంట్ చేసుకోవడం తప్పనిసరి చేయాలని ఆధికారులను ఆదేశించారు. భార్యభర్తలు తమ సంబంధాల వల్ల పుట్టే పిల్లల సంరక్షణ కోసం తమ ప్రణాలిక వివరాలను నమోదు చేసే విధంగా పటిష్ట వ్యవస్తను ఏర్పాటు చేయాలని అనూప్ కుమార్ దండ్ (Anup Kumar Dand) సూచించారు.

స్త్రీ భాగస్వామి సంపాదన పొందని పక్షంలో పురుష భాగస్వామి ఆమెకు మెయింటెనెన్స్ ను ఎలా చెల్లించాలి అనే వివరాలను కూడా అగ్రిమెంట్ (agreement) లో చేర్చాలని తెలిపారు. దీని కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక చట్టాన్ని రూపొందించే వరకు చట్టబద్దమైన పథకం (legal scheme) రూపంలో రూపొందించడం అవసరం అని, అందుకు తగిన ఫార్మాట్ ను తయారు చేసి ఇవ్వాలని, రిలేషన్ షిప్ లోకి ప్రవేశించడానికి ముందు ఈ నిబంధనలపై ఒప్పందం చేసుకోవాలని వివరించింది.

  1. అటువంటి సంబంధం నుండి జన్మించిన పిల్లల విద్య, ఆరోగ్యం, పెంపకం బాధ్యతలను భరించేందుకు ప్రణాళిక రూపంలో పురుష, స్త్రీ భాగస్వాముల బాధ్యతను నిర్ణయించడం.
  2. సంపాదన లేని స్త్రీ భాగస్వామి తో పాటు అలాంటి సంబంధం వల్ల వారకి పుట్టిన పిల్లల నిర్వహణ కోసం పురుష భాగస్వామి యొక్క బాధ్యతను నిర్ణయించడం.

ఈ నిబంధనలతో కూడిన అగ్రిమెంట్ తప్పనిసరిగా చేసుకోవాలని, దీనిని ప్రత్యేక ట్రిబ్యునల్ ద్వారా రిజిస్టర్ చేయబడేలా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని హైకోర్టు సూచించింది. అంతేగాక దీనికోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ (Web Portal) ను తయారు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని చెప్పింది.



Next Story

Most Viewed