- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేజ్రీవాల్ అక్రమాలకు నేనే సాక్షిని.. జైలు నుంచి సుఖేష్ మరో సంచలన లేఖ
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ మరో లేఖ రాశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్‌పై తాజాగా స్పందించారు. ‘‘ఆలస్యమైనా చివరకు నిజమే గెలుస్తుంది. సరికొత్త భారత్‌కు ఉన్న శక్తికి ఇదొక క్లాసిక్ ఉదాహరణ. తీహార్ క్లబ్‌కు మీకు స్వాగతం పలుకుతున్నా. ఖట్టర్ ఇమాన్దార్ అనే డ్రామాలకు ముగింపు పడింది. కేజ్రీవాల్ అవినీతి మొత్తం బహిర్గతం అవుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ మొత్తం 10 కుంభకోణాలు చేశారు. నాలుగు కుంభకోణాలకు నేనే సాక్షిగా ఉన్నాను. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రారంభం మాత్రమే. త్వరలోనే అప్రూవర్‌గా మారి నిజాలన్నీ బయటపెడతా’ అని సుఖేష్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నారు.
కాగా, ఢిల్లీ లిక్కర్ కేసులో ప్రస్తుతం సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేయగా.. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆరు రోజుల ఈడీ కస్టడీ విధించింది. ఈ నెల 28 వరకు కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉండనున్నారు. మరోవైపు కేజ్రీవాల్ అరెస్ట్ కావడంతో ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, నేతలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. ఆప్ నేతలతోపాటు దేశంలోని ప్రతిపక్ష కూటమి ఇండియా నేతలు కూడా మోదీ సర్కార్ వైఖరి పట్ల తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.