- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సోషల్ మీడియాలో ఉదయనిధి వర్సెస్ అన్నామలై

- మీరు 'గెట్ అవుట్ మోడీ' అని వైరల్ చేయండి
- నేను 'గెట్ అవుట్ స్టాలిన్' అని ట్రెండింగ్ చేస్తా
- ఎవరి నినాదం ట్రెండ్ అవుతుందో చూద్దాం
- తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై సవాలు
దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడులో మరో సారి హిందీ భాష బలవంతంగా రుద్దడంపై మాటల యుద్దానికి తెరలేచింది. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కు ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై సోషల్ మీడియా వార్‌కు సవాలు విసిరారు. 'ఎక్స్'లో మీరు 'గెట్ అవుట్ మోడీ' అని రాత్రంతా ట్రెండ్ చేయండి. మీ డీఎంకే ఐటీ వింగ్‌ను అవసరం అయితే ఇతర సోర్స్‌లను ఉపయోగించుకోండి. ఉదయం ఆరు గంటల నుంచి మేము 'గెట్ అవుట్ స్టాలిన్'ను ట్రెండ్ చేస్తాము. ఎవరి నినాదం ఎక్కువ ట్రెండ్ అవుతుందో చూద్దామని సవాలు విసిరారు. 'మీరు మీ వనరులన్నీ ఉపయోగించి సాధ్యమైనంతగా మోడీపై వ్యతిరేక నినాదాన్ని ట్రెండ్ చేయండి. ఆ తర్వాత మా నినాదాన్ని ట్రెండ్ చేస్తాం. ఇప్పుడు ఉదయం ఆరు అయ్యింది. ఇది బీజేపీ' టైం అంటూ అన్నామలై 'ఎక్స్' వేదికగా పోస్టు పెట్టారు. రాష్ట్రంలో సరైన పాలన అందించడంలో, పిల్లల రక్షణలో డీఎంకే ప్రభుత్వం విఫలమైందని అన్నామలై ఆరోపించారు. కాగా, ఇటీవల ప్రధాని మోడీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వం హిందీని బలవంతంగా రుద్దాలని ప్రయత్నిస్తే ఇకపై 'గో బ్యాక్ మోడీ' అని కాకుండా 'గెట్ అవుట్ మోడీ' అని నినాదాలు ఇవ్వాల్సి వస్తుందని ఉదయనిధి హెచ్చరించారు. ఆ వ్యాఖ్యలకు స్పందనగానే అన్నామలై ఈ సవాలు విసిరారు.
కాగా, ఉదయనిధి చేసిన 'గెట్ అవుట్ మోడీ' వ్యాఖ్యలపై అన్నామలై తీవ్రంగా స్పందించారు. కరూరులో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం ఉదయనిధిని 'అరేయ్' అని సంభోదించారు. దీంతో డీఎంకే, బీజేపీ పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అన్నామలైకి దమ్ముంటే అన్నాసలైలోని డీఎంకే ప్రధాన కార్యాలయానికి రావాలని ఉదయనిధి సవాలు విసిరారు. దీంతో ఇరు పార్టీల మధ్య రాజకీయ వైరం మరింతగా ముదిరింది. అన్నామలై వ్యాఖ్యలపై స్పందించాలని శుక్రవారం మీడియా కోరగా.. ఆయన గురించి మాట్లాడటానికి తనకు ఆసక్తి లేదని ఉదయనిధి చెప్పారు. భాషా హక్కుల కోసం తమిళనాడులో ఎంతో మంది ప్రాణాలు అర్పించారు. ఇప్పుడు భాషపై ఎవరు రాజకీయాలు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు.