ఇక కృష్ణ జన్మభూమిపై బీజేపీ దృష్టి: యూపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు

by samatah |
ఇక కృష్ణ జన్మభూమిపై బీజేపీ దృష్టి: యూపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈ నెల 22న అయోధ్య రామమందిరానికి శంకుస్థాపన జరగనున్న విషయం తెలిసిందే. ఇక, బీజేపీ వారణాసి, మధుర ఆలయాలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. త్వరలో కృష్ణ జన్మభూమి ప్రాంగణంలో భారీ ఆలయాన్ని నిర్మిస్తామని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య తెలిపారు. రామజన్మభూమి ఆందోళనలో పాల్గొన్న సాధ్వి రితంభర 60వ పుట్టినరోజు సందర్భంగా ఆయన మధుర-బృందావన్‌ను సందర్శించారు. కృష్ణ జన్మభూమి సర్వేకు కోర్టు అనుమతి ఇచ్చినందున తుది నిర్ణయం కూడా హిందువులకు అనుకూలంగానే వస్తుందని చెప్పారు. మధుర, బృందావన్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక నిధులు కేటాయించిందని తెలిపారు. కృష్ణ జన్మభూమిని సందర్శించిన మొదటి ప్రధాని నరేంద్ర మోడీనే అని గుర్తు చేశారు. శ్రీకృష్ణ ఆలయాన్ని నిర్మించడం సమాజ్‌వాదీ పార్టీకి ఇష్టం లేదని ఆరోపించారు. ఈ విషయంలో అఖిలేశ్ యాదవ్ తన వైఖరిని స్పష్టం చేయాలని సవాల్ విసిరారు. కాగా, శ్రీ కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదం కేసు వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story