- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
విమానంలో భారీ కుదుపు.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు
by Javid Pasha |

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఎయిర్ ఇండియా విమానానికి భారీ ప్రమాదం తప్పింది. బీ787-800 విమానం ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీకి వెళ్తుండగా ఆకాశంలోనే భారీ కుదుపులకు లోనైంది. ఒక్కసారిగా విమానం ఒడిదుడుకులకు గురికావడంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా ఏం జరుగుతోందో అని భయంతో వణికిపోయారు. ఈ ఘటనలో ఏడుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
దీంతో అదే విమానంలో ప్రయాణిస్తున్న ఓ వైద్యుడు, నర్సు, సిబ్బంది గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించారు. విమానం సిడ్నీ ఎయిర్ పోర్టుకు చేరుకోగానే ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించాల్సిన అవసరం లేదని వైద్యలు తెలిపారు. ఈ ఘటనతో విమానంలోని ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది.
Next Story