Amith shah: ఇంజనీరింగ్, వైద్య విద్యను తమిళంలో బోధించండి.. స్టాలిన్‌కు అమిత్ షా సూచన

by vinod kumar |
Amith shah: ఇంజనీరింగ్, వైద్య విద్యను తమిళంలో బోధించండి.. స్టాలిన్‌కు అమిత్ షా సూచన
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడులో అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (DMK), బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మధ్య భాషా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith shah) సీఎం స్టాలిన్ (Stalin)కు కీలక సూచన చేశారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్, వైద్య విద్యను తమిళంలో అందించాలని సూచించారు. రాణిపేటలోని ఆర్టీసీ తక్కోలం వద్ద శుక్రవారం జరిగిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యురిటీ ఫోర్స్ (CISF) 56వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. తమిళ విద్యార్థుల ప్రయోజం కోసం కేంద్ర ప్రభుత్వం సీఐఎస్ఎఫ్ పరీక్షను తమిళంలోనే రాసేలా నిబంధనలు తీసుకొచ్చిందని అలాగే స్టాలిన్ కు దమ్ముంటే ఇంజనీరింగ్ (Engineering), మెడిసిన్ (Medicine) విద్యను తమిళంలో ప్రారంభించాలని స్టాలిన్ ను కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ భాషల్లోనూ నియామక ప్రక్రియను ప్రారంభించిందని గుర్తు చేశారు.

సీఏపీఎఫ్ నియామకాల్లో మాతృ భాషకు స్థానం లేదని కానీ ఈ పరీక్షను తమిళం సహా అనేక భాషల్లో రాసేలా ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చిందన్నారు. భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని బలోపేతం చేయడంలో తమిళనాడు కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. పరిపాలనా సంస్కరణల నుంచి మొదలుకుని ఆధ్యాత్మిక ఉన్నత శిఖరాల వరకు ప్రతి రంగంలోనూ భారతీయ సంస్కృతిని తమిళనాడు బలోపేతం చేసిందన్నారు. కాగా, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్ఈపీ) అమలు విషయంలో తమిళనాడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమిత్ షా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.



Next Story

Most Viewed