Amith shah: నకిలీ రాజ్యాంగవాదులకు తెరపడింది.. మహారాష్ట్ర విజయంపై అమిత్ షా

by vinod kumar |
Amith shah: నకిలీ రాజ్యాంగవాదులకు తెరపడింది.. మహారాష్ట్ర విజయంపై అమిత్ షా
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర(Maharashtra)లో మహాయుతి కూటమి (Mahayuthi alliance) ఘన విజయం సాధించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amith shah) స్పందించారు. రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన ప్రతిపక్షాలపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. రాజ్యాంగానికి నకిలీ మద్దతుదారులుగా నటించే వారి దుకాణాలకు తెరపడిందన్నారు. ‘ఛత్రపతి శివాజీ మహారాజ్, బాబాసాహెబ్ అంబేడ్కర్, జ్యోతిబాఫూలే, వీర్ సావర్కర్‌ల పుణ్యభూమి మహారాష్ట్ర. రాష్ట్ర సంస్కృతిని నిరంతరం కాపాడే మహాయుతి కూటమి భారీ విజయం సాధించడం ఎంతో గర్వకారణం. ఈ గెలుపుతో నకిలీ రాజ్యంగా మద్దతు దారులుగా నటించే వారికి ప్రజలు తెరదించారు. అబద్ధాల సహాయంతో రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వారికి షాక్ ఇచ్చారు. ఈ విజయం ప్రతి మహారాష్ట్ర వాసి విజయం’ అని తెలిపారు.

మహాయుతి సాధించిన ఈ విజయం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని డబుల్ ఇంజన్ ప్రభుత్వ పని తీరుకు నిదర్శనమని అని కొనియాడారు. బుజ్జగింపు రాజకీయాలను తిరస్కరించడం ద్వారా మహారాష్ట్ర ప్రజలు తమ వారసత్వం, అభివృద్ధి, సంక్షేమంపై తమ విశ్వాసాన్ని మరోసారి వ్యక్తం చేశారని తెలిపారు. బీజేపీని అత్యధిక శాతం ఓట్లతో ఆశీర్వదించినందుకు జార్ఖండ్ ప్రజలకు షా కృతజ్ఞతలు చెప్పారు. కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీలతో కూడిన మహాయుతి కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story