సీఏఏతో ముస్లింలకు అన్యాయం.. క్లారిటీ ఇచ్చిన అమిత్ షా

by Gantepaka Srikanth |
సీఏఏతో ముస్లింలకు అన్యాయం.. క్లారిటీ ఇచ్చిన అమిత్ షా
X

దిశ, వెబ్‌డెస్క్: సీఏఏ(CAA)తో శరణార్థులకు న్యాయం జరుగుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు 188 మందికి సీఏఏ సర్టిఫికెట్లు ఇచ్చారు. చొరబాటుదారులకు కాంగ్రెస్ పౌరసత్వం కల్పించిందని అన్నారు. బంగ్లాదేశ్‌లో ఒకప్పుడు 27శాతం మంది హిందువులు ఉండేవారు. ప్రస్తుతం అక్కడ కేవలం 9శాతం మందే ఉన్నారని గుర్తుచేశారు. బౌద్ధులు, సిక్కులు లేదా జైనుల కారణంగా పొరుగు దేశాల్లో హిందువులు హింసకు గురయ్యారని గుర్తుచేశారు. ఇండియా కూటమి వారికి న్యాయం చేయలేదని, కానీ ప్రధాని మోడీ చేసి చూపించారని చెప్పారు. సీఏఏ ముస్లింలకు వ్యతిరేకమని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.

Advertisement

Next Story