ఆ రాష్ట్రాలన్నీ అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయం: కేంద్ర మంత్రి ఆర్ కే సింగ్ వార్నింగ్

by samatah |
ఆ రాష్ట్రాలన్నీ అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయం: కేంద్ర మంత్రి ఆర్ కే సింగ్ వార్నింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉచిత విద్యుత్ అందించే రాష్ట్రాలన్నీ అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయమని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్ కే సింగ్ హెచ్చరించారు. ఎందుకంటే అప్పుగా తీసుకున్న డబ్బును రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత విద్యుత్ అందించేందుకు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ఆదివారం ఆయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడారు. ఇతర వస్తువుల్లాగే విద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు ఎంతో ఖర్చు అవుతుందని తెలిపారు. కాబట్టి ఒక రాష్ట్రంలోని వినియోగదారులకు దానిని ఉచితంగా అందించాలంటే ఆర్థికంగా ఎంతో బలంగా ఉండాలని చెప్పారు. ఉత్పాదకతకు అయ్యే ఖర్చును భరించేందుకు మరింత అప్పులు చేయాల్సి వస్తుందని తెలిపారు.

ఈ విషయాన్ని ఎప్పటి నుంచో రాష్ట్రాలకు సూచిస్తూనే ఉన్నానని వెల్లడించారు. అయినప్పటికీ అధిక రుణాలు ఉన్న రాష్ట్రాలు సైతం ఇటువంటి ప్రజాకర్షక పథకాలపై హామీలు ఇస్తున్నాయని, ఇది ఎంతో ప్రమాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయని గుర్తు చేశారు. దీనికి పంజాబ్ రాష్ట్రాన్ని ఉదాహరణగా చూపాడు. 2022లో పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌తో సహా అనేక ప్రజాకర్షక పథకాలను అమలు చేసిందని..తద్వారా మొదటి రెండేళ్లలోనే రూ.47000 కోట్లు అప్పుగా తీసుకుందని తెలిపారు. అప్పుల భారం వల్ల భవిష్యత్ తరాలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి డబ్బు ఉండదని, ఎందుకంటే వచ్చిన ఆదాయం అంతా రుణాల చెల్లింపులకే వెళ్తుందని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed