లివ్ ఇన్ రిలేషన్ షిప్ బ్రేకప్ అయితే భరణం చెల్లించాల్సిందే.. కోర్టు సంచలన తీర్పు

by Prasad Jukanti |   ( Updated:2024-04-06 10:09:51.0  )
లివ్ ఇన్ రిలేషన్ షిప్ బ్రేకప్ అయితే భరణం చెల్లించాల్సిందే.. కోర్టు సంచలన తీర్పు
X

దిశ, డైనమిక్ బ్యూరో:దేశంలో రోజు రోజుకు లివ్ ఇన్ రిలేషన్ షిప్(సహజీనం) బంధాలు పెరుగిపోతున్న తరుణంలో మధ్యప్రదేశ్ హైకోర్టు శనివారం సంచలన తీర్పు వెల్లడించింది. స్త్రీ, పురుషుడి మధ్య ఉన్న లివ్ ఇన్ రిలేషన్‌షిప్ బ్రేకప్ అయితే వారిరువురు సహజీననం చేసినట్లు రుజువైతే భరణం తిరస్కరించలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. చట్టబద్ధంగా వివాహం చేసుకోకపోయినా, పురుషుడితో చాలా కాలం పాటు జీవించే మహిళ విడిపోయిన తర్వాత భరణం కోరవచ్చని తెలిపింది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న మహిళకు నెలవారి అలవెన్స్ ఇవ్వాలని ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును ఓ వ్యక్తి మధ్యప్రదేశ్ హైకోర్టులో సవాల్ చేశాడు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సదరు మహిళకు నెలవారి భరణం కింద రూ.1,500 చెల్లించాలని తీర్పునిచ్చింది. దంపతుల మధ్య సహజీవనం ఉన్నట్లు రుజువైతే భరణాన్ని తిరస్కరించలేమని న్యాయమూర్తులు పేర్కొన్నారు. అయితే దేశంలో సహజీనం చేస్తున్న వారి సంఖ్య పెరిగిపోతున్న తరుణంలో మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే గత ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో జీవించాలనుకునే వారు ఇక తప్పనిసరి లీగల్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే అని యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రేమ్ వర్క్ సందర్భంగా నియమాలను రూపొందించిన సంగతి తెసిసిందే.

Advertisement

Next Story

Most Viewed