Akash anand: బీఎస్పీ నుంచి ఆకాశ్ ఆనంద్ సస్పెండ్.. మాయావతి సంచలన నిర్ణయం

by vinod kumar |
Akash anand: బీఎస్పీ నుంచి ఆకాశ్ ఆనంద్ సస్పెండ్.. మాయావతి సంచలన నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో: తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ (Aakash anand)కు బహుజన్ సమాజ్ వాదీ పార్టీ(బీఎస్పీ) చీఫ్ మాయావతి (Mayawati) మరో షాక్ ఇచ్చారు. బీఎస్పీ పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించారు. పార్టీ షోకాజ్ నోటీసుకు ఆకాశ్ స్పందించలేదని, అహంకారపూరితంగా వ్యవరిస్తున్నారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘ఆకాష్ ఆనంద్ పార్టీ ప్రయోజనాల కంటే తన మామ అశోక్ సిద్ధార్థ్ ప్రభావంతో పనిచేస్తున్నారు. అందుకే పార్టీ బాధ్యతల నుంచి తొలగిస్తూ బీఎస్పీ అఖిల భారత సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. దీనికిగాను పశ్చాత్తాపపడి పరిణతిని చూపించాల్సింది. కానీ దీనికి విరుద్ధంగా ఆకాష్ ఇచ్చిన సుదీర్ఘ ప్రతిస్పందన ఆయన అహంకారాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది’ అని పేర్కొన్నారు.

అందుకే ఆత్మ గౌరవ ఉద్యమ ప్రయోజనాల దృష్యా పార్టీ నుంచి సస్పెండ్ చేశామని, పార్టీలో ఇలాంటి వారందరిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తామని తెలిపారు. కాగా, అంతకుమందు రోజు ఆకాశ్‌ను బీఎస్పీ జాతీయ సమన్వయకర్త సహా పలు పార్టీ పదవుల నుంచి ఆయనను మాయావతి తొలగించింది. ఉత్తరప్రదేశ్‌తో సహా దేశవ్యాప్తంగా పార్టీని రెండు వర్గాలుగా విభజించాలని ఆకాశ్ కుట్ర పన్నారని ఆమె ఆరోపించారు.

Next Story

Most Viewed