NCP మీటింగ్‌కు అజిత్ పవార్ డుమ్మా.. మహారాష్ట్రలో హీటెక్కుతున్న పాలిటిక్స్

by Satheesh |
NCP మీటింగ్‌కు అజిత్ పవార్ డుమ్మా.. మహారాష్ట్రలో హీటెక్కుతున్న పాలిటిక్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ రాష్ట్రానికి పొరుగున ఉన్న మహారాష్ట్రలో చోటు చేసుకుంటున్న పరిణామాలు రాజకీయంగా సంచలనం అవుతున్నాయి. కాంగ్రెస్‌తో స్నేహం కొనసాగిస్తున్న ఎన్సీపీ త్వరలో బీజేపీతో దోస్తీ కట్టబోతోందనే ఊహాగానాల మధ్య.. తాజాగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ వైఖరి మరోసారి హాట్ టాపిక్ అయింది. ఇవాళ ముంబైలో జరుగుతున్న పార్టీ కార్యక్రమానికి అజిత్ పవార్ గైర్హాజరు అయ్యారు.

దీంతో ఎన్సీపీకి చెందిన మరి కొంత మంది ఎమ్మెల్యేలతో కలిసి అజిత్ పవార్ బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారానికి తాజా పరిణామం బలాన్ని చేకూర్చేలా మారింది. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ.. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో సమావేశం అయిన మరుసటి రోజే అజిత్ పవార్ పార్టీ మీటింగ్‌ను స్కిప్ చేయడం చర్చనీయాశం అవుతోంది. కాగా సమావేశానికి దూరంగా ఉండటంపై స్పందించిన అజిత్ పవార్.. ఇతర కార్యక్రమాలు ఉండటం వల్లే తాను పార్టీ సమావేశానికి హాజరు కాలేకపోయానని స్పష్టం చేశారు.

మరో వైపు ఈ వ్యవహారంపై ఎన్సీపీ రియాక్ట్ అయింది. పార్టీ సమావేశానికి అజిత్ పవార్ హాజరు కాలేనంత మాత్రాన ఆయన పార్టీని వీడుతున్నారని అర్థం కాదన్నారు. బీజేపీకి షాక్ ఇచ్చేలా ప్రతిపక్షాలు గట్టి ప్రయత్నం చేస్తున్నాయి. ఇదే సమయంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మోడీని గద్దె దింపేందుకు విపక్షాలు ఏకం కావాలని ప్రయత్నాలు సాగిస్తున్న వేళ.. కాంగ్రెస్‌కు అత్యంత సన్నిహిత పార్టీగా పేరున్న ఎన్సీపీ అగ్రనేతలు శరద్ పవార్, అజిత్ పవార్‌ల వైఖరి విపక్షాల పార్టీల్లో చర్చగా మారింది.

Advertisement

Next Story

Most Viewed