Agnipath scheme: అగ్నిపథ్ స్కీమ్‌పై రాహుల్ వర్సెస్ రాజ్ నాథ్..లోక్ సభలో వాగ్వాదం

by vinod kumar |
Agnipath scheme: అగ్నిపథ్ స్కీమ్‌పై రాహుల్ వర్సెస్ రాజ్ నాథ్..లోక్ సభలో వాగ్వాదం
X

దిశ, నేషనల్ బ్యూరో: అగ్నిపథ్ స్కీమ్‌పై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పార్లమెంట్ సమావేశాల ఆరో రోజైన సోమవారం బడ్జెట్‌పై రాహుల్ మాట్లాడుతూ..అగ్నిపథ్ పథకం ద్వారా దేశంలోని సైనికులు, వారి కుటుంబాల ఆర్థిక భద్రతను దోచుకున్నారని తెలిపారు. ‘అమరవీరుడు అగ్నివీర్ కుటుంబానికి పరిహారం అందజేశామని రక్షణ మంత్రి చెప్పారు. కానీ అది పూర్తిగా తప్పు. అగ్నివీర్ కుటుంబానికి కేవలం ఇన్సూరెన్స్ డబ్బు మాత్రమే ఇచ్చారు. అది ఆర్థిక సహాయం కాదు’ అని వ్యాఖ్యానించారు. ‘ఒక అగ్నివీర్ పేలుడులో ప్రాణాలు కోల్పోయాడు. నేను అతన్ని అమరవీరునిగా భావిస్తున్నా. కానీ భారత ప్రభుత్వం అలా చేయదు’ అని తెలిపారు. దీనిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ..అగ్నివీర్‌కు సంబంధించి సభలో ఎప్పుడైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ అంశంపై రాహుల్ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. విధి నిర్వహణలో మరణించిన అగ్నివీరుల కుటుంబాలకు రూ. కోటి ఆర్థిక సహాయం అందుతుందని స్పష్టం చేశారు.

Advertisement

Next Story