పరువు నష్టం కేసులో మేధా పాట్కర్‌ను దోషిగా తేల్చిన కోర్టు

by S Gopi |
పరువు నష్టం కేసులో మేధా పాట్కర్‌ను దోషిగా తేల్చిన కోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: నర్మదా బచావో ఆందోళన్ వ్యవస్థాపకురాలు మేధా పాట్కర్‌ను ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసులో కోర్టు దోషిగా నిర్ధారించింది. 2000 నాటి ఈ కేసులో పాట్కర్‌కు జరిమానా లేదా రెండేళ్ల జైలు శిక్ష లేదా రెండూ విధిస్తారు. దీనిపై విచారణ జరిపిన మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రాఘవ్ శర్మ తీర్పును వెలువరించారు. 2000 సంవత్సరం నుంచి మేధా పాట్కర్, వీకే సక్సేనాల మధ్య ఈ న్యాయ పోరాటం కొనసాగుతోంది. అప్పట్లో వీకే సక్సేనా అహ్మదాబాద్‌ కేంద్రంగా పనిచేసే ఎన్జీవో నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌కు చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించేవారు. మేధా పాట్కర్‌ గుజరాత్‌లో నర్మదా బచావో ఆందోళన్‌కు నాయకత్వం వహించేవారు. ఈ సమయంలో పాట్కర్‌, సక్సేనా ఒకరిపై ఒకరు తరచూ కోర్టులకెక్కేవారు. తనపై మేధా పాట్కర్‌ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని వీకే సక్సేనా అప్పట్లో క్రిమినల్‌ డిఫమేషన్‌ కేసు దాఖలు చేశారు. పరువు నష్టం కలిగించేలా పత్రికా ప్రకటన జారీ చేశారని కూడా ఆరోపిస్తూ మరో కేసు దాఖలు చేశారు.

Advertisement

Next Story