AAP MLA Naresh Yadav: ఆప్ ఎమ్మెల్యే నరేష్ యాదవ్ కు జైలు శిక్ష

by Shamantha N |
AAP MLA Naresh Yadav: ఆప్ ఎమ్మెల్యే నరేష్ యాదవ్ కు జైలు శిక్ష
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎమ్మెల్యే నరేష్ యాదవ్‌కు(Naresh Yadav) రెండేళ్ల జైలుశిక్ష పడింది. 2016లో జరిగిన మలేర్ కోట్ల(Malerkotla) హింస కేసులో నరేష్ యాదవ్ ని కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో ఆయనకు రెండేళ్ల జైలుశిక్షతో పాటు, రూ.11 వేల జరిమానా విధించింది. మత విశ్వాసాలను అవమానించడం ద్వారా వారి మతపరమైన భావాలను రెచ్చగొట్టడం, వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, నేరపూరిత కుట్ర కేసులో ఆయన్ని దోషిగా తేల్చింది. అయితే, దేశద్రోహ ఆరోపణలను మాత్రం కోర్టు కొట్టివేసింది.

అసలేం జరిగిందంటే?

జూన్ 24, 2016న మలేర్‌కోట్లలోని రోడ్డుపై ఖురాన్‌ పుస్తకంలోని పేజీలు కనిపించాయి. దీంతో, అక్కడ హింసచెలరేగింది. ఈ కేసులో విజయ్ కుమార్, నందకిషోర్, గౌరవ్ కుమార్ సహా మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత అందులో నిందితుడిగా నరేష్ యాదవ్ ని చేర్చారు. మార్చి 2021లో నరేష్ యాదవ్, నందకిషోర్ ను సాక్ష్యాధారాలు లేవని దిగువ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో, బాధితులు మలేర్ కోట్ల కోర్టుని ఆశ్రయించారు. కాగా.. ఈ కేసులో నరేష్ యాదవ్ ని కోర్టు దోషిగా ప్రకటించింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)తో ముడిపడి ఉన్న విజయ్ కుమార్ బ్యాంక్ ఖాతాలో అనుమానాస్పద రూ. 90 లక్షల లావాదేవీకి సంబంధించి 2018లో యాదవ్ చేసిన ఆరోపణలతో సహా ఈ కేసు వివాదాస్పదమైంది.

Advertisement

Next Story