గుడి ముందు రాహుల్ గాంధీ ఫోటోతో కూడిన డోర్ మ్యాట్!.. (వీడియో వైరల్)

by Ramesh Goud |
గుడి ముందు రాహుల్ గాంధీ ఫోటోతో కూడిన డోర్ మ్యాట్!.. (వీడియో వైరల్)
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేవాలయం ముందు రాహుల్ గాంధీ ఫోటోతో కూడిన డోర్ మ్యాట్ ను వాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. మహారాష్ట్రలోని ఓ హనుమాన్ దేవాలయం ముందు డోర్ మ్యాట్ ఏర్పాటు చేశారు. ఈ డోర్ మ్యాట్ లో లోక్ సభా పక్ష నేత రాహుల్ గాంధీ ఫోటో ఉండటం ఆశ్చర్యానికి గురి చేసింది. గుడిలోకి వెళ్లాలంటే ఆ మ్యాట్ ను తొక్కుకుంటూ వెళ్లాల్సిందే. దేవుడిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులు రాహుల్ గాంధీ ఫోటో ఉన్న మ్యాట్ పై నడుచుకుంటూ వెళుతున్నారు.

దీని ఏర్పాటుకు గల కారణం.. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్ గాంధీ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారని ఆరోపణలు వచ్చాయి. దీంతో మహారాష్ట్రలోని హనుమాన్ ఆలయ నిర్వాహకులు గుడి ముందు ఈ విధంగా ఏర్పాటు చేశారు. దీనిపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. రాహుల్ గాంధీని అవమానించేలా చేసిన ఆలయ నిర్వాహకులపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఈ వీడియోపై కాంగ్రెస్ వాదులు దుమ్మెత్తి పోస్తు్న్నారు. ఇది బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాదుల పనేనని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. కాగా లోక్ సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. రాహుల్ గాంధీ హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీతో పాటు ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలు తీవ్రంగా మండిపడ్డాయి.

Advertisement

Next Story