- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఉద్యోగులకు 186 శాతం పెరగనున్న పెన్షన్?

- సిఫార్సు చేయనున్న 8వ పే కమిషన్
- రిటైర్డ్ ఉద్యోగులకు భారీ ఊరట
దిశ, నేషనల్ బ్యూరో:
కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు భారీ ఊరట లభించనుంది. 8వ పే కమిషన్ సిఫార్సులు అమలు చేస్తే ప్రస్తుతం ఉన్న పెన్షన్ 186 శాతం మేర పెరగనున్నట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే 8వ పే కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. 2026 జనవరి 1 నుంచి 8వ పే కమిషన్ సిఫార్సులు అమలు కానున్నాయి. దీని వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, అలవెన్సులు, ఇతర బెనిఫిట్స్ భారీగా పెరగనున్నాయి. 8వ పే కమిషన్ 2.86 ఫిట్‌మెంట్‌ను సిఫార్సు చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. ఒక వేళ ఇది అమలు అయితే నెలవారీ పెన్షన్లు భారీగా పెరుగుతాయి. 2016లో 7వ పే కమిషన్ 2.57 ఫిట్‌మెంట్ ప్రకటించింది. దీంతో బేసిక్ పే భారీగా పెరిగింది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు కనీసం రూ.9 వేల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే పెన్షన్‌ను రూ.1.5 లక్షలకు దాట కూడదని నిర్ణయించారు. దీంతో పాటు 53 శాతం డీఆర్ ఇవ్వాలని నిర్ణయించారు. దీని వల్ల ద్రవ్యోల్చణ పరిస్థితుల నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ ఏర్పడింది. ఇప్పుడు 8వ పే కమిషన్ కనుక 2.86 ఫిట్‌మెంట్ అమలు చేస్తే రూ.9 వేలు ఉన్న కనీస పెన్షన్ రూ.25,740 అవుతుంది. అంటే ఒక్క సారిగా 186 శాతం మేర పెరగనున్నది. ఇది రిటైర్డ్ ఉద్యోగులకు భారీ ఊరటే అని చెప్పవచ్చు.