- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking News : నవజ్యోత్ సింగ్ సిద్దుకు రూ.850 కోట్ల లీగల్ నోటీసులు
దిశ, వెబ్ డెస్క్ : క్యాన్సర్ బారిన పడి చివరి దశలో ఉన్న తన భార్య ఆయుర్వేద పద్ధతులు, ఆ ఆహారం ద్వారా దాని నుంచి కోలుకున్నదని కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu) ఇటీవల ప్రకటించారు. నవంబర్ 21న మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్(Navajot Kour)కు ఛత్తీస్‌గఢ్ సివిల్ సొసైటీ(CCS) నుంచి రూ.850 కోట్ల మేర లీగల్ నోటీసు జారీ చేసింది. సిద్దూ వ్యాఖ్యలు క్యాన్సర్ రోగులు చికిత్సను వదిలేసేలా, మధ్యలోనే మందులు మానివేసేలా ఉన్నాయని సీసీఎస్ ఆరోపించింది. ఆమె క్యాన్సర్ రికవరీ డైట్ గురించి సిద్ధూ చేసిన వాదనలపై వివరణ కోరింది. మీ ఆరోగ్యం, క్యాన్సర్ నుంచి కోలుకోవడం గురించి మీ భర్త సిద్ధూ వాదనలకు మద్దతు ఇస్తున్నారా? మీ చికిత్స కోసం మీరు తీసుకున్న అల్లోపతి మందులు ప్రభావం చూపలేదని మీరు నమ్ముతున్నారా? మీరు కోలుకోవడానికి వేప ఆకులు, నిమ్మరసం, తులసి, పసుపు వంటి ఆహారాన్ని మాత్రమే తీసుకున్నారా? లేదా మీరు అల్లోపతి మందులను కూడా వాడారా? అని నోటీసుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో సిద్ధూ వాదనలకు మద్దతు ఇచ్చే సాక్ష్యాలను ఏడు రోజుల్లోగా సమర్పించాలని ఆ సంస్థ డిమాండ్ చేసింది. లేని పక్షంలో ప్రజలను ‘తప్పుదోవ పట్టించే’ వాదనలకు పరిహారంగా రూ.850 కోట్లు చెల్లించాలని సిద్ధూ భార్య కౌర్‌ను ఆ నోటీసుల్లో పేర్కొంది.