Delhi Assembly Elections: ఢిల్లీ ఎన్నికల బరిలో 699 మంది అభ్యర్థులు

by Shamantha N |
Delhi Assembly Elections: ఢిల్లీ ఎన్నికల బరిలో 699 మంది అభ్యర్థులు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు(Delhi Assembly Elections) జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గాను 699 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు ఎన్నికల సంఘం(EC) అధికారులు వెల్లడించారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 672 మంది బరిలో నిలిచారు. కాగా.. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోటీ చేసే వారి సంఖ్య అధికంగనే ఉన్నట్లు ఈసీ అధికారులు తెలిపారు. ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈసారి 981 మంది అభ్యర్థులు 1522 నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ గడువు పూర్తి కావడంతో బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) అధినేత, మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal), బీజేపీ అభ్యర్థి పర్వేశ్‌ వర్మ, కాంగ్రెస్‌ అభ్యర్థి సందీప్‌ దీక్షిత్‌ పోటీ చేస్తున్న న్యూఢిల్లీలోనే అత్యధికంగా 23మంది బరిలో నిలిచారు. ఆ తర్వాత జనక్‌పురిలో 16మంది, రోహ్తాస్‌ నగర్‌, కర్వాల్‌నగర్‌, లక్ష్మీనగర్‌లలో 15మంది చొప్పున అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మరోవైపు, పటేల్‌నగర్‌, కస్తూర్బా నగర్‌లలో అత్యల్పంగా కేవలం ఐదుగురు అభ్యర్థులు మాత్రమే పోటీ చేస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మొత్తం 70 నియోజకవర్గాలు ఉండగా.. 38చోట్ల 10మంది కన్నా తక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. తిలక్‌నగర్‌, మంగోల్‌పురి, గ్రేటర్‌ కైలాస్‌ సీట్లలో ఆరుగురు చొప్పున; చాందినీ చౌక్‌, రాజేంద్రనగర్‌, మాలవీయనగర్‌లలో ఏడుగురు చొప్పున అభ్యర్థులు బరిలో నిలిచారు.



Next Story

Most Viewed