Snakebite Every Year : పాముకాటుతో భారత్‌లో ఏటా 50 వేల మంది మృతి : బీజేపీ ఎంపీ

by Ramesh N |   ( Updated:2025-02-01 05:04:05.0  )
Snakebite Every Year : పాముకాటుతో భారత్‌లో ఏటా 50 వేల మంది మృతి : బీజేపీ ఎంపీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్‌లో పాముకాటు కారణంగా ఏటా 50 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికమని బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ అన్నారు. ఇవాళ పార్లమెంట్‌లో బడ్జెట్‌పై చర్చలు జరిగాయి. సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో కీలక విషయాలపై చర్చ సందర్భంగా పాము కాట్ల మరణం అంశాన్ని లేవనెత్తారు.

ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ మాట్లాడుతూ.. భారతదేశం అంతటా ఏటా 30 నుంచి 40 లక్షల మంది ప్రజలు పాము కాటుకు గురవుతున్నారని వెల్లడించారు. దాదాపు 50 వేల మంది పాము కాటుకు మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రపంచంలోనే అత్యధికమని, భయంకరమైన మరణాల రేటు అని రూడీ అన్నారు. ఈ నేపథ్యంలోనే పాము కాటు మరణాల నివారణ చర్యలపై వివరించారు. మరోవైపు బీహార్ అత్యంత పేద రాష్ట్రం అని, పేదరికం, ప్రకృతి వైపరీత్యాలు రెండింటినీ భరిస్తుందని చెప్పారు.

Next Story

Most Viewed