- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏనుగుల కోసం రూ.5 కోట్ల ఆస్తి.. ఎక్కడంటే?
దిశ, వెబ్‌డెస్క్: ఏనుగుల మీద ప్రేమను ఓ వ్యక్తి వినూత్నంగా చాటుకున్నాడు. పెంచుకున్న ఏనుగుల పేరిట ఆ వ్యక్తి ఏకంగా రూ.5కోట్ల ఆస్తిని రాసిచ్చాడు. బీహార్ లోని జాన్ పూర్ కు చెందిన మహమ్మద్ అక్తర్ ఇమామ్ అనే వ్యక్తి రెండు ఏనుగుల పేరిట ఈ మొత్తాన్ని రాసిచ్చాడు. ఇటీవల అనారోగ్యంతో ఓ ఏనుగు మరణించడంతో రాణి అనే ఏనుగు మొత్తం ఆస్తి కి వారసురాలిగా కొనసాగుతోంది. అక్తర్ తాను పెంచుకుంటున్న ఏనుగులకు మోతి, రాణి అని పేర్లు పెట్టాడు. తన మరణానంతరం వాటికి ఏలాంటి లోటు రాకుండా ఉండాలని భావించి తనకున్న రూ.5కోట్ల ఆస్తిని ఏనుగుల పేరిట వీలునామా రాశాడు.
అయితే ఆయనకు భార్య, పిల్లలు ఉండగా వారితో విడిపోయాడు. అతడు తన ఆస్తిని ఏనుగులకు రాసివ్వడం వారికి నచ్చలేదు. అయితే 2021లో అక్తర్ హత్యకు గురయ్యాడు. అప్పటికే వీలునామా రాయడంతో ఆస్తి మొత్తం ఏనుగులకు దక్కింది. ప్రస్తుతం రాణి అనే ఏనుగు ఉత్తరాఖండ్‌లో ఓ వ్యక్తి సంరక్షణలో ఉంటోంది. అక్తర్ రాసిచ్చిన ప్రాపర్టీ పట్నాలో ఉంది. అటవీ అధికారులు మాట్లాడుతూ.. ఆస్తిని ఏనుగు కోసం సద్వినియోగం చేస్తేనే అక్తర్ లక్ష్యం నేరవేరుతుందన్నారు.