- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జైళ్లలో ఆగని లైంగికదాడులు
దిశ, నేషనల్ బ్యూరో: దేశంలోని జైళ్లలో అత్యాచారాల ఘటనలు కొనసాగుతున్నాయి. మహిళల విషయంలో పోలీసు అధికారుల నిర్లక్ష్యంతో పాటు జవాబుదారీతనం లేకపోవడంతో జైళ్లలో రేప్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఎన్‌సీఆర్‌బీ ప్రకారం, 2017 నుంచి 2022 మధ్య కాలంలో దేశంలోని అన్ని జైళ్లలో 270కి పైగా కస్టడీ అత్యాచార కేసులు నమోదయ్యాయి. మహిళల భద్రత లోపించడం వల్లనే ఈ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని నివేదిక అభిప్రాయపడింది. ఈ ఘటనలో నేరస్థులుగా పోలీసు సిబ్బంది, పబ్లిక్ సర్వెంట్లు, సాయుధ దళాల సభ్యులు, జైళ్లు, రిమాండ్ ఖైదీలు, ఆసుపత్రుల సిబ్బంది ఉన్నారు. 2017లో మొత్తం 89 కేసులు నమోదవగా, ఆ తర్వాత 2018లో 60, 2019లో 47, 2020లో 29, 2021లో 26, 2022లో 24 కేసులు నమోదయ్యాయని నివేదిక వివరించింది. 2017 నుంచి అత్యధిక కస్టోడియల్ రేప్ కేసుల్లో ఉత్తరప్రదేశ్ 92 కేసులతో ముందువరుసలో ఉండగా, ఆ తర్వాత 43 కేసులతో మధ్యప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. కొందరు సిబ్బంది అధికార దుర్వినియోగం చేస్తూ అత్యాచారానికి పాల్పడుతున్నారని పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పూనమ్ ముత్రెజా అన్నారు.