గన్‌తో కాల్చుకుని 23 ఏళ్ల కానిస్టేబుల్ ఆత్మహత్మ..కారణం ఇదే!

by Anjali |
గన్‌తో కాల్చుకుని 23 ఏళ్ల కానిస్టేబుల్ ఆత్మహత్మ..కారణం ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: కానిస్టేబుల్ సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లఖింపూర్ ఖేరి నివాసి అయిన 23 ఏళ్ల వివేక్ వర్మ 2020 బ్యాచ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ఛోటా దుసాహ్ లొకాలిటీలో అద్దెకు ఉంటున్నాడు. అతడు శనివారం డ్యూటీకి రాకపోవడంతో పోలీసు సిబ్బందిని ఎస్పీ తన ఇంటికి పంపారు. వారు ఇంటికి వెళ్లి చూడగా, వివేక్ రక్తపు మడుగులో పడి ఉండడం చూసి షాక్ అయ్యారు. అతడి పక్కకే సర్వీస్ ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్ పాటు సూసైడ్ నోట్ కూడా ఉంది. అందులో వివేక్ తను చనిపోవడానికి కుటుంబ కలహలే కారణమని రాశాడు. ఆయన మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఆసుపత్రికి తరలించి.. విషయాన్ని కుటుంబీకులకు తెలిపామని, కేసు విచారణ చేపడుతున్నామని వివేక్‌కు పోలీసు లైన్‌లో పోస్టింగ్ ఇచ్చిన ఎస్పీ కేశవ్ కూమార్ వెల్లడించారు.

Advertisement

Next Story